Proddatur: ప్రొద్దుటూరు హౌసింగ్ సొసైటీ నూతన పాలకవర్గం కొలువు

Proddatur: వైఎంఆర్ కాలనీలో ప్రొద్దుటూరు కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారం చేసింది; చైర్మన్‌గా విశ్రాంత ఏఆర్ ఓబుళరెడ్డి బాధ్యతలు చేపట్టారు.

CHANDRASHEKAR REDDY, ANAPARATHI
Published on: 31 Oct 2026 8:25 PM IST
Proddatur
X

Proddatur: ప్రొద్దుటూరు హౌసింగ్ సొసైటీ నూతన పాలకవర్గం కొలువు

ప్రొద్దుటూరు: కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని వైఎంఆర్ కాలనీలో 'ది ప్రొద్దుటూరు కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ' నూతన పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. ​ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ నంద్యాల రాఘవరెడ్డి మాట్లాడుతూ.. 76 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ సొసైటీ సుమారు 12 వేల మంది సభ్యులతో మూడు కాలనీలను అభివృద్ధి చేసిందని గుర్తుచేశారు.

ఇటీవల జరిగిన అవకతవకల వల్ల సంస్థ కుంటుపడటంతో పాత కమిటీని రద్దు చేసి, నూతన కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సొసైటీ చైర్మన్, విశ్రాంత అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఓబుళరెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే సహకారంతో నాగిరెడ్డి, శ్రీనివాసులు, చంద్రమోహన్‌రెడ్డి, వద్ది ఓబులేసులతో కూడిన నూతన కమిటీ బాధ్యతలు చేపట్టిందన్నారు. ​బైలాలో అవసరమైన మార్పులు చేసి అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తాం. ​పాత మాన్యువల్ ఖాతాలను పూర్తిగా కంప్యూటరీకరిస్తాం.

​సొసైటీకి సంబంధించిన మొండి బకాయిలను త్వరితగతిన వసూలు చేస్తాం. ​ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి, సభ్యులకు మెరుగైన సేవలు అందిస్తాం. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, మార్కెట్ యార్డు ఇన్‌చార్జి చైర్మన్ పట్నం లక్ష్మణ్ కుమార్, జెడ్పిటిసి బచ్చల ప్రతాప్, సినీస్టార్ గంజికుంట ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

CHANDRASHEKAR REDDY, ANAPARATHI

CHANDRASHEKAR REDDY, ANAPARATHI