Proddatur: ప్రొద్దుటూరు మండలంలో ఘన విజయం.. 23 ఎంపీటీసీలు ఏకగ్రీవం!

Proddatur: కడప జిల్లా ప్రొద్దుటూరు మండలంలో 23 ఎంపీటీసీలు ఏకగ్రీవం. 5వ వార్డు ఎంపీటీసీగా చిలకల ప్రభావతి ఏకగ్రీ ఎన్నిక. డిక్లరేషన్ పత్రం అందజేత.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 27 Oct 2026 8:32 PM IST
Proddatur
X

Proddatur: ప్రొద్దుటూరు మండలంలో ఘన విజయం.. 23 ఎంపీటీసీలు ఏకగ్రీవం!

Proddatur: కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రొద్దుటూరు మండలం మొత్తం 24 ఎంపీటీసీ లు గాను 23 ఎంపీటీసీలు ఏకగ్రీవాలు. ​ఇందులో భాగంగా 5 వార్డు ఎంపీటీసీ చిలకల ప్రభావతి, ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారుల నుంచి ఆమె తన ఎన్నికల డిక్లరేషన్ పత్రాన్ని అందుకున్నారు. ​ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై అభినందనలు తెలిపారు. ప్రభావతి మాట్లాడుతూ నాకు ఏకగ్రీవ ఎన్నికకు సహకరించినటువంటి ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ రాఘవరెడ్డి, టిడిపి నాయకులు నంద్యాల కొండారెడ్డి, బసిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, తదితర నాయకులకు అందరికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR