Proddatur: ప్రొద్దుటూరులో వరసిద్ధి వినాయకునికి ఘనంగా అన్నదానం
Proddatur: ప్రొద్దుటూరు శ్రీరామ అపార్ట్‌మెంట్ వద్ద వరసిద్ధి వినాయక అసోసియేషన్ ఆధ్వర్యంలో 4 వేల మంది భక్తులకు ఘనంగా అన్నప్రసాద వితరణ నిర్వహించారు.
Proddatur: ప్రొద్దుటూరులో వరసిద్ధి వినాయకునికి ఘనంగా అన్నదానం
ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మున్సిపల్ ఆఫీస్ సమీపంలోని శ్రీరామ అపార్ట్‌మెంట్ వద్ద 'వరసిద్ధి వినాయక అసోసియేషన్' 7వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. మట్టి వినాయక మండపం వద్ద నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 9వ రోజు స్వామివారు భక్తులకు విశేష రూపంలో దర్శనమిచ్చారు.
ఉదయం నుంచే స్వామివారికి భక్తిశ్రద్ధలతో విశేష పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండపం వద్దకు భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తుల కోసం కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ (అన్నదానం) చేపట్టి, సుమారు 4,000 మందికి పైగా అన్నప్రసాదాలు అందజేశారు.
గణనాథుని కృపాకటాక్షాలు మరియు ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైనా ఉండాలని, అందరికీ ఆయురారోగ్యాలు ప్రసదించాలని కమిటీ ప్రతినిధులు ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
ఈ పూజా కార్యక్రమాలు మరియు అన్నదానంలో అసోసియేషన్ సభ్యులు గౌస్, నాగేష్, మురళి, సురేంద్రలతో పాటు ఇతర కమిటీ ప్రతినిధులు, భక్తులు విశేషంగా పాల్గొని జయప్రదం చేశారు.




