Proddatur: ప్రొద్దుటూరు అమ్మవారి శాలలో రాజరాజేశ్వరి దేవి దర్శనం
Proddatur: రెండో మైసూర్‌గా ప్రసిద్ధి చెందిన ప్రొద్దుటూరు శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిచ్చారు.
Proddatur: ప్రొద్దుటూరు అమ్మవారి శాలలో రాజరాజేశ్వరి దేవి దర్శనం
ప్రొద్దుటూరు: దసరా ఉత్సవాల్లో దేశంలోనే రెండవ మైసూర్ గా పేరుగాంచిన కడప జిల్లా ప్రొద్దుటూరులో దసరా శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. దసరా శరన్నవరాత్రులలో భాగంగా శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో నేడు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు.
అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు ఆలయానికి పోటెత్తారు. భక్తులకు ఎటువంటి ఆసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.




