Proddatur: కూటమి క్లీన్ స్వీప్ – 23 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం!

Proddatur: ప్రొద్దుటూరు మండలంలో 24 ఎంపీటీసీ స్థానాల్లో 23 కూటమి ఏకగ్రీవం. 20 టీడీపీ, 3 జనసేన కైవసం. తాళ్లమాపురం స్థానానికి జనసేన vs స్వతంత్ర అభ్యర్థి పోరు.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 27 Oct 2026 8:08 PM IST
Proddatur
X

Proddatur: కూటమి క్లీన్ స్వీప్ – 23 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం!

ప్రొద్దుటూరు: కడప జిల్లా ప్రొద్దుటూరు మండలంలో ఎంపీటీసీ (MPTC) ఎన్నికల ప్రక్రియ ఆసక్తికర మలుపు తిరిగింది. మండలంలోని మొత్తం 24 ఎంపీటీసీ స్థానాలకు గానూ ఏకంగా 23 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ​

కూటమి అభ్యర్థుల హవా స్పష్టంగా కనిపించిన ఈ ఎన్నికల్లో ​తెలుగుదేశం పార్టీ 20 స్థానాల్లో ఏకగ్రీవ విజయం సాధించింది. జనసేన పార్టీ 3 స్థానాల్లో ఏకగ్రీవంగా గెలుపొందింది.

ఏకగ్రీవంగా ఎన్నికైన 23 మంది అభ్యర్థులు ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి అధికారికంగా డిక్లరేషన్ ఫారాలను అందుకున్నారు.

తాళ్లమాపురం ఒక్క స్థానంలో మాత్రమే ఎంపీటీసీ స్థానంలో మాత్రం ఏకగ్రీవం కాకపోవడంతో అక్కడ ఎన్నికల పోటీ నెలకొంది. ఈ స్థానానికి జనసేన అభ్యర్థి వీరం మౌనిక, స్వతంత్ర అభ్యర్థి సిగినేని సుబ్బమ్మ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది.

మిగిలిన ఈ ఒక్క స్థానానికి త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ​మండలంలో మెజారిటీ స్థానాలు కూటమి వశం కావడంతో స్థానిక నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR