Proddatur: ఎంపీటీసీ నామినేషన్ల వేళ ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టులు!
Proddatur: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ఎంపీటీసీ నామినేషన్ల వేళ ముందస్తు అరెస్టులు. టీడీపీ, వైసీపీ కీలక నాయకులు హౌస్ అరెస్ట్, పోలీస్ స్టేషన్కు తరలింపు.
Proddatur: ఎంపీటీసీ నామినేషన్ల వేళ ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టులు!
Proddatur: ప్రొద్దుటూరు ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీటీసీ నామినేషన్ల దాఖలు ప్రక్రియ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జారకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే పలువురు ముఖ్య నాయకులను పోలీసులు అరెస్టులతో పాటు హౌస్ అరెస్టులు చేశారు.
ప్రముఖ టిడిపి నాయకులు పర్లపాడు మహేశ్వర్ రెడ్డి, బచ్చల వీర ప్రతాప్ లను పోలీసులు వారి నివాసాల్లోనే హౌస్ అరెస్ట్ చేశారు. వైసిపి నాయకుడు కల్లూరు నాగేంద్ర తో పాటు, ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ మాజీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రా రెడ్డి ని పోలీసులు అరెస్ట్ చేసి రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేలా ఎంపీడీవో కార్యాలయం మరియు పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.




