Yerraguntla: పొట్లదుర్తి ఉప సర్పంచ్ వెంకట శివారెడ్డికి డిక్లరేషన్ పత్రం
Yerraguntla: ఎర్రగుంట్ల మండలం పొట్లదుర్తి ఉప సర్పంచ్‌గా ఏకగ్రీవమైన బీజేపీ నేత పగిడాలపాటి వెంకట శివారెడ్డికి రిటర్నింగ్ అధికారి సంజీవ్ కుమార్ డిక్లరేషన్ పత్రం అందజేశారు.
Yerraguntla: పొట్లదుర్తి ఉప సర్పంచ్ వెంకట శివారెడ్డికి డిక్లరేషన్ పత్రం
ఎర్రగుంట్ల: కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పొట్లదుర్తి గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. పంచాయతీ సర్పంచ్‌గా యాదం మల్లికార్జున యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనతో పాటు పంచాయతీ పరిధిలోని మొత్తం 14 మంది వార్డు సభ్యులు కూడా ఏకగ్రీవమయ్యారు. అనంతరం వార్డు సభ్యులందరూ ఏకగ్రీవంగా 6వ వార్డు బీజేపీ సభ్యుడు పగిడాలపాటి వెంకట శివారెడ్డిని ఉప సర్పంచ్‌గా ఎన్నుకున్నారు.
ఏకగ్రీవంగా ఎన్నికైన ఉప సర్పంచ్ గా బిజెపి వెంకట శివారెడ్డి కి శుక్రవారం రిటర్నింగ్ అధికారి సంజీవ్ కుమార్ అధికారిక డిక్లరేషన్ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ మాట్లాడుతూ. తన ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, ఎంపీ సీఎం రమేష్, సీఎం సురేష్ నాయుడులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
అలాగే వార్డు సభ్యులకు, కూటమి నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు, గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెంకట శివారెడ్డి హామీ ఇచ్చారు.




