Porumamilla: పోరుమామిళ్లలో అటవీ అమరవీరుల దినోత్సవం: ఘన నివాళులు!
Porumamilla: కడప జిల్లా పోరుమామిళ్ల రేంజ్ కార్యాలయంలో రాష్ట్ర అటవీ అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన వీరులకు నివాళులర్పించారు.
Porumamilla: పోరుమామిళ్లలో అటవీ అమరవీరుల దినోత్సవం: ఘన నివాళులు!
పోరుమామిళ్ళ: కడప జిల్లా DFO గౌరవ శ్రీ బాలరాజు IFS గారి ఆదేశాలు మేరకు పోరుమామిళ్ళ రేంజ్ అధికారి శ్రీ రఘునాథ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు పోరుమామిళ్ళ రేంజ్ కార్యాలయంలో రాష్ట్ర అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణ లో అమరులైన అటవీ అధికారులు కు రెండు నిమిషాలు మౌనం పాటించి ఘనంగా నివాళులు అర్పించడమైనది. ఈ సందర్భంగా రేంజ్ అధికారి శ్రీ రఘునాథ రెడ్డి గారు మాట్లాడుతూ రాజమండ్రి కి చెందిన శ్రీనివాస్ IFS గారు గంధపు చెక్కలు స్మగ్లర్ వీరప్పన్ చేతిలో హత్య కు గురికావడం బాధాకరం.
వారి స్పూర్తి గా విధి నిర్వహణ లో నిజాయితీ గా ఉండాలని అలాగే మన ప్రాణాలు కాపాడుకోవలసిన బాధ్యత కూడా మనపై ఉంటుందని సిబ్బంది కి పలుసూచనలు చేశారు. డాగ్ స్క్వాడ్ సింభ అమరవీరుల కు నివాళులు అర్పించడమైనది.ఈ కార్యక్రమంలో సెక్షన్ అధికారులు, బీట్ అధికారులు మరియు ప్రొటెక్షన్ వాచర్లు పాల్గొన్నారు.




