Duvvur: దువ్వూరు మండల ప్రత్యేక అధికారిగా పోలు రవిచంద్రబాబు బాధ్యతలు!

Duvvur: దువ్వూరు మండల పరిషత్ ప్రత్యేక అధికారిగా పోలు రవిచంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తామన్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 28 Sept 2026 9:55 AM IST
Duvvur
X

Duvvur: దువ్వూరు మండల ప్రత్యేక అధికారిగా పోలు రవిచంద్రబాబు బాధ్యతలు!

Duvvur: దువ్వూరు మండలపరిషత్ ప్రత్యేక అధికారిగా పోలు రవిచంద్రబాబు ను ప్రభుత్వం నియమించింది. ఈనెల 23తో మండల పరిషత్ అధ్యక్షుల పదవీకాలం ముగిసింది. దువ్వూరు మండల ప్రత్యేక అధికా రిగా కడప అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్టికల్చర్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న పోలు రవిచంద్రబాబు జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు శనివారం బాధ్యతలు అప్పగించినట్లు అయన తెలిపారు. ఈ సందర్భంగా రవిచంద్రబాబు మాట్లాడుతూ దువ్వూరు మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తానన్నారు. అందుకు మండలంలోని అధికారులు,రాజకీయ నాయకులు,ప్రజలు సహకరించాలని రవిచంద్రబాబు సూచించారు

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR