Rayachoti: రామాపురంలో పోలీసుల విస్తృత తనిఖీలు.. 10 వాహనాలు సీజ్!

Rayachoti: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అన్నమయ్య జిల్లా రామాపురం పరిధిలో పోలీసులు విస్తృత తనిఖీలు, కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 13 Oct 2026 10:54 AM IST
Rayachoti
X

Rayachoti: రామాపురంలో పోలీసుల విస్తృత తనిఖీలు.. 10 వాహనాలు సీజ్!

Rayachoti: అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్,. గారి ఆదేశాల మేరకు, రాయచోటి డీఎస్పీ శ్రీ ఎం.ఆర్. కృష్ణమోహన్ గారి పర్యవేక్షణలో రామాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా, సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించబడిన బీసీ కాలనీ, నల్లగుట్టపల్లె, మరియు చిట్లూరు హరిజనవాడ ప్రాంతాల్లో పోలీసు బలగాలు కవాతు నిర్వహించాయి.

ఈ తనిఖీల్లో లక్కిరెడ్డిపల్లె సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ హెచ్. కృష్ణంరాజు గారు, రామాపురం ఎస్ఐ శ్రీ కె.బి. శివకుమార్ గారు, లక్కిరెడ్డిపల్లె ఎస్ఐ శ్రీమతి జి. శోభ గారు, గాలివీడు ఎస్ఐ శ్రీ జె. నరసింహారెడ్డి గారితో పాటు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ (CASO)లో భాగంగా పోలీసులు ప్రతి ఇంటిని, దుకాణాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 10 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు స్థానికులతో ముఖాముఖి మాట్లాడి, ఎన్నికల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడవద్దని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించవద్దని హెచ్చరించారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సహకరించాలని పోలీసులు ప్రజలను కోరారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI