Jammalamadugu: జమ్మలమడుగులో మోదీ జన్మదిన వేడుకలు: ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి

Jammalamadugu: కడప జిల్లా మైలవరం గురుకుల పాఠశాలలో ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఆధ్వర్యంలో సేవా సంకల్ప అభియాన్ ఘనంగా జరిగింది.

D. CHINNI KRISHNA, JAMMALAMADUGU
Published on: 17 Sept 2026 3:06 PM IST
Jammalamadugu
X

Jammalamadugu: జమ్మలమడుగులో మోదీ జన్మదిన వేడుకలు: ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి

కడప జిల్లా: మైలవరం మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా సేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షులు భూపేష్ సుబ్బరామిరెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

మోదీ ప్రజా సేవా ప్రస్థానం, దేశ అభివృద్ధి కోసం చేస్తున్న కృషి గురించి విద్యార్థినులు తెలుసుకోవాలని సూచించారు. దాదాపు 25 ఏళ్లుగా ప్రజా సేవలో కొనసాగుతూ, విదేశాలతో సత్సంబంధాలు కొనసాగించడంతో పాటు దేశ ఆర్థిక అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్న నరేంద్ర మోదీని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బలంగా ఉందని వైస్సార్సీపీ ఓటమి కోసం టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పనిచేస్తాయని తెలిపారు.

D. CHINNI KRISHNA, JAMMALAMADUGU

D. CHINNI KRISHNA, JAMMALAMADUGU