Rayachoti: రాయచోటిలో ఘనంగా ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు!
Rayachoti: రాయచోటిలోని మంత్రి కార్యాలయంలో ఘనంగా ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.
Rayachoti: రాయచోటిలో ఘనంగా ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు!
Rayachoti: భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి వర్యులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాయచోటి ఎస్.ఎన్. కాలనీలోని మంత్రి కార్యాలయంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు కేక్ కట్ చేసి ప్రధాని నరేంద్ర మోదీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చేస్తున్న కృషి అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. ప్రధాని మోదీ గారు ఆయురారోగ్యాలతో, సంపూర్ణంగా దేశానికి మరింత సేవలందించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ప్రధాని నరేంద్ర మోదీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.




