Mydukur: దువ్వూరులో ఘనంగా ప్రధాని మోదీ 76వ జన్మదిన వేడుకలు!

Mydukur: మైదుకూరు నియోజకవర్గం దువ్వూరులో ప్రధాని మోదీ 76వ జన్మదిన వేడుకలు ఘనం. ఆలయంలో పూజలు, రైతు సంక్షేమ అవగాహన సదస్సు నిర్వహించారు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 18 Sept 2026 7:29 AM IST
Mydukur
X

Mydukur: దువ్వూరులో ఘనంగా ప్రధాని మోదీ 76వ జన్మదిన వేడుకలు!

Mydukur: భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 76వ జన్మదినాన్ని పురస్కరించుకుని దువ్వూరు మండల కేంద్రంలో పలు సేవా, అవగాహన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.

​శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో 'ఆశీర్వాద దీపం'

నరేంద్ర మోదీ సుదీర్ఘ 25 సంవత్సరాల ప్రజా పరిపాలనను పురస్కరించుకుని స్థానిక శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి దేవస్థానంలో బీజేపీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో 25 దీపాలను వెలిగించి "ఆశీర్వాద దీపం" కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రధాని ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని నాయకులు ఆకాంక్షించారు.

​రైతు సంక్షేమ పథకాలపై అవగాహన సదస్సు

ప్రధాని జన్మదినం సందర్భంగా పారదీప్ ఫాస్ఫేట్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలు, వాటి ద్వారా రైతాంగానికి చేకూరే ప్రయోజనాలు, వాటి అమలు తీరుపై పారదీప్ ఫాస్ఫేట్స్ లిమిటెడ్ కంపెనీ డిప్యూటీ మేనేజర్ వరప్రసాద్ రైతులకు సవివరంగా అవగాహన కల్పించారు. ఈ సదస్సులో జైకిసాన్ జంక్షన్ మేనేజర్ శ్రీనివాస్, మేధా ఆగ్రో ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ప్రొప్రైటర్ రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అరవేటి హరికృష్ణ, మాజీ మండలాధ్యక్షుడు రాజగోపాల్ రెడ్డి, మాజీ జిల్లా కార్యవర్గ సభ్యులు బ్రహ్మచారి, కిసాన్ మోర్చా మండలాధ్యక్షులు బాలనాగిరెడ్డి, శ్రీనివాసులు, నరేంద్ర రాయల్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR