Pileru: రూ.7.5 కోట్లతో పీలేరు ఆలయాల అభివృద్ధి: బీఆర్ నాయుడు

Pileru: వాల్మీకిపురం కోదండ రామాలయం, తరిగొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయాల అభివృద్ధికి రూ.7.5 కోట్లతో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఎమ్మెల్యే కిషోర్ శంకుస్థాపన చేశారు.

RAVI, PILERU
Updated on: 28 Sept 2026 3:45 PM IST
Pileru
X

Pileru: రూ.7.5 కోట్లతో పీలేరు ఆలయాల అభివృద్ధి: బీఆర్ నాయుడు

Pileru: ఈరోజు పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురం మండలం వాల్మీకిపురం లో ఉన్న శ్రీ కోదండ రాముల వారి దేవాలయం మరియు తరిగొండలోని లక్ష్మీనరసింహస్వామి దేవాలయం అభివృద్ధి కొరకు సుమారు 7.5 కోట్ల రూపాయలను శంకుస్థాపన చేసిన టిటిడి చైర్మన్ బి ఆర్ నాయుడు మరియు పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మరియు టిటిడి ఎక్స్ బోర్డ్ మెంబర్ బీజేపీ నాయకుడు భాను ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు మాట్లాడుతూ నేను 1970లో పీలేరుకు ఒకసారి వచ్చి చూశాను అప్పటి పీలేరుకు ఇప్పటి పీలేరుకు చాలా వ్యత్యాసం ఉన్నది ఎంతో అభివృద్ధి పథంలో నల్లారి కుటుంబం చొరవతో పీలేరు అభివృద్ధిలో చాలా ముందుకు వెళ్లిందని ఆశ్చర్యపోయారు.

అలాగే సనాతన ధర్మ గురించి మాట్లాడుతూ వాల్మీకిపురంలోని కోదండ రామాలయం ఆర్చి నిర్మాణం కొరకు మరియు అలాగే గుడి అభివృద్ధి కొరకు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి మేరకు ఈ నిధులను తక్షణమే బోర్డు మీటింగ్ లో పెట్టి శాంక్షన్ చేయడం జరిగిందని చెప్పారు.

బి ఆర్ నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గత క్యాబినెట్లో దేవాలయాల అభివృద్ధి కొరకు సుమారు కొత్త దేవాలయం నిర్మించాలని కోరగా నేను విన్నపించగా దానికి బదులుగా వెయ్యి కాదు ఐదువేల దేవాలయాలు కొత్తవి టిటిడి ఆధ్వర్యంలో నిర్మించాలని చెప్పడంతో చాలా సంతోషంతో అలాగే ప్రార్థనమైన దేవాలయాల మరమ్మత్తు కొరకు నిధులు వెంటనే సాంక్షన్ చేసి కొత్త దేవాలయం నిర్మాణానికి పూనుకోవాలని ముఖ్యమంత్రి గారి చొరవతో ఈ పనుల అభివృద్ధికి శంకుస్థాపన చేయడం జరిగిందని ఈ అవకాశం నాకు సాక్షాత్తు ఆ కోదండ రాముని ఆశీస్సులతో జరగడం అయిందని తెలిపారు అభివృద్ధిలో నల్లారి కుటుంబం చాలా ముందంజలో ఉందని చెప్పారు.

స్థానిక పీలేరు ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ వెంగమాంబ ఆలయ అభివృద్ధికి ఆ దేవుడు నాకు ఇచ్చిన వరమని ఈ అవకాశం మా ఫ్యామిలీ మా నాయన కాలం నుంచి ఈ ఆలయాల అభివృద్ధికి సహకారం తోడ్పాటు రెండు జరుగుచున్నదని ఇది మరువలేని జనని నా జన్మలో ఇంత మంచి భాగ్యం ఎప్పుడు కలగదని ఈ ఆలయ అభివృద్ధికి ఎల్లవేళలా మా కుటుంబం ముందుంటుందని చెప్పారు.

వాల్మీకిపురంలో రాములవారి కళ్యాణోత్సవం జరిగే సమయంలో గుడిలో ఉన్న ప్లేసు చాలా చిన్నదిగా ఉండడంతో కళ్యాణోత్సవం జరిపించుకొనుటకు రాములవారికి ఒక మినీ ఫంక్షన్ హాల్ మాదిరి నిర్మాణానికి మూడు కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇది వాల్మీకిపురం పూర్వ ప్రజలకు మనకు చాలా శుభ పరిణామం అని ఎమ్మెల్యే అన్నారు.

అలాగే మాజీ ముఖ్యమంత్రి చీఫ్ విప్ గా ఉన్నప్పుడు తిరుమలలో ఉన్న ఉచిత అన్నదానం ప్రసాదానికి శ్రీ వెంగమాంబ అని పేరు పెట్టడం శుభ పరిణామం ని ఈ తరిగొండ ఆలయంలో వెంగమాంబ గుర్తుగా ఆనాడు తిరుమలలో ఉచిత అన్నదానానికి ఆ పేరు పెట్టడం జరిగిందని గుర్తు చేసుకున్నారు.

RAVI, PILERU

RAVI, PILERU