Annamayya: ఇంటర్‌ పరీక్ష ఫీజుల దోపిడీని అరికట్టాలి పీడీఎస్‌యూ తీవ్ర ఆగ్రహం

Annamayya: కడప, అన్నమయ్య జిల్లాల్లో ప్రైవేట్ కళాశాలలు ఇంటర్ పరీక్ష ఫీజుల పేరుతో మూడింతలు వసూలు చేస్తున్నాయంటూ పీడీఎస్‌యూ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 29 Oct 2026 10:42 PM IST
Annamayya
X

Annamayya: ఇంటర్‌ పరీక్ష ఫీజుల దోపిడీని అరికట్టాలి పీడీఎస్‌యూ తీవ్ర ఆగ్రహం

అన్నమయ్య: కడప ,అన్నమయ్య జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజుల పేరుతో కార్పొరేట్ ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి మూడింతలు అధికంగా వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను దోపిడీకి గురిచేయడం దారుణమని పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. అంకన్న తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

గురువారం పీడీఎస్‌యూ రాయలసీమ ప్రాంతీయ కార్యాలయంలో మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్ణయించిన పరీక్ష ఫీజులకంటే అధికంగా వసూలు చేస్తున్న విద్యాసంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యను వ్యాపారంగా మార్చి, పరీక్షల పేరుతో విద్యార్థుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేయడం ఎంత మాత్రం సహించరాని విషయమని పేర్కొన్నారు.

ఇంటర్ అధికారులు తక్షణమే స్పందించి అధిక ఫీజులు వసూలు చేస్తున్న కళాశాలలపై ఉన్నతస్థాయి విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అంకన్న డిమాండ్ చేశారు.

విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల వివరాలను ప్రతి కార్పొరేట్ ప్రవేట్ కళాశాలలో స్పష్టంగా ప్రదర్శించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ యు జిల్లా నగర నాయకులు మహేష్, దుర్గేష్, ఖాసీం, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI