Rayachoti: దసరా సెలవుల్లో ప్రైవేట్ పాఠశాలల ఇష్టారాజ్యం!

Rayachoti: రాయచోటి నియోజకవర్గంలో దసరా సెలవుల్లోనూ కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు ఇష్టారాజ్యంగా తరగతులు నిర్వహిస్తున్నాయని, నిబంధనలు ఉల్లంఘిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 11 Oct 2026 10:53 AM IST
Rayachoti
X

Rayachoti: దసరా సెలవుల్లో ప్రైవేట్ పాఠశాలల ఇష్టారాజ్యం!

Rayachoti: దసరా సెలవులు ప్రారంభమైనప్పటికీ పలు కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారని,మరోవైపు ప్రైవేటు ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తున్నారు.విద్యాశాఖ అధికారులు ఎందుకు స్పందించడం లేదని పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. అంకన్న ప్రశ్నించారు.

డీఈవో సుబ్రహ్మణ్యం విద్యార్థుల హక్కులను కాపాడాల్సిన మీరే కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలకు సమాధానం చెప్పాలని ,ప్రభుత్వ ఉత్తర్వులను అమలు పాటించకపోతే మీ బాధ్యత ఏమిటి? రాయచోటి, తంబళ్లపల్లె, పీలేరు, మదనపల్లె ప్రాంతాలతో పాటు పుంగనూరు నియోజకవర్గ పరిధిలో కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా దసరా సెలవులు విద్యార్థుల హక్కులను కాలరాస్తున్నారు.

పై తక్షణమే విచారణ చేపట్టి, నిబంధనల ఉల్లంఘన నిర్ధారణ అయితే బాధ్యుల పై చర్యలు తీసుకోవాలని అంకన్న డిమాండ్ చేశారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI