Brahmamgarimatam: పల్లె పండుగ నిధులతో గ్రామాల్లో సమగ్ర అభివృద్ధి!

Brahmamgarimatam: కూటమి ప్రభుత్వం చేపట్టిన పల్లె పండుగ 3.0 నిధులతో గ్రామాల్లో సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని బీజేపీ మండల అధ్యక్షుడు చంద్ర ఓబుల్ రెడ్డి తెలిపారు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 30 Sept 2026 2:22 PM IST
Brahmamgarimatam
X

Brahmamgarimatam: పల్లె పండుగ నిధులతో గ్రామాల్లో సమగ్ర అభివృద్ధి!

Brahmamgarimatam: కూటమి ప్రభుత్వం చేపట్టిన ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమం ద్వారా గ్రామసీమల రూపురేఖలు మారనున్నాయని బీజేపీ మండల అధ్యక్షుడు పెద్దిరెడ్డి చంద్ర ఓబుల్ రెడ్డి అన్నారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి ఈ పథకం కింద భారీగా నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలకు ఆయన మండల ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

​మండల పరిధిలోని సోమిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ గిరిజన కాలనీలో ఆయన స్థానిక నాయకులతో కలిసి పర్యటించి, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కేంద్ర, రాష్ట్రాల్లోని డబుల్ ఇంజిన్ సర్కార్ సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా రూ. 11,085 కోట్ల భారీ నిధులతో గ్రామీణాభివృద్ధి పనులు మొదలయ్యాయన్నారు. ఇందులో కేంద్ర వాటా రూ. 5,391 కోట్లు, రాష్ట్ర వాటా రూ. 5,694 కోట్లు ఉన్నాయని వివరించారు.

​వికసిత్ భారత్ రోజ్‌గార్ అజీవికా మిషన్ ద్వారా గ్రామాల్లో పెద్దఎత్తున సీసీ రోడ్లు, గోకులాల నిర్మాణాలు మంజూరయ్యాయని, పల్లె పండుగ 3.0 ద్వారా బ్రహ్మంగారిమఠం మండలానికి లక్షలాది రూపాయల నిధులు కేటాయించారని తెలిపారు.

గిరిజన కాలనీలో నెలకొన్న సమస్యలను మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లి అధికారుల సహకారంతో వెంటనే పరిష్కరిస్తామన్నారు. కాలనీకి విద్యుత్ సౌకర్యం, సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడంతో పాటు, టీటీడీ సహకారంతో దేవాలయ నిర్మాణానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి బుస్శెట్టి సుధాకర్ రమణ, ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యుడు చంద్రకాంతం ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR