Punganur: చౌడేశ్వరి నవరాత్రులకు ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డికి ఆహ్వానం
Punganur: పుంగనూరు చౌడేశ్వరి దేవి ఆలయంలో అక్టోబర్ 11 నుంచి 20 వరకు జరిగే నవరాత్రి ఉత్సవాలకు విచ్చేయాలని పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డిని జనసేన నేతలు ఆహ్వానించారు.
Punganur: చౌడేశ్వరి నవరాత్రులకు ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డికి ఆహ్వానం
Punganur: పుంగనూరు మండల కేంద్రంలోనీ శ్రీ సప్తమతృకా సమేత చౌడేశ్వరి దేవి ఆలయంలో ఈ నెల 11 నుంచి 20 వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించునున్న దేవీ నవరాత్రి మహోత్సవాలకు విచ్చేయాలని పుంగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ నేతలు వేణుగోపాల్ రెడ్డి లేదు పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డిని శనివారం పలమనేరులో కలసి ఆహ్వానించారు.
ఏటా ఘనంగా జరగనున్న ఉత్సవాలలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని వారు కోరారు. దీంతో ఆయన తప్పకుండా విచ్చేసి ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొంటానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన పుంగనూరు జనసేన ఇంచార్జ్ చిన్నా రాయల్, నాయకులు మరియు ఎన్ వి ఆర్ ట్రస్ట్ అధినేత వేణుగోపాల్ రెడ్డి, శంకర్ రెడ్డి రమణారెడ్డి రోహిత్ నాగరాజు రెడ్డి లతో పాటు పలమనేరు జనసేన నాయకులు పూల చైతన్య,నాగరాజు, మురాదు తదితరులు పాల్గొన్నారు.




