Kadapa: కడప అమీన్ పీర్ దర్గా ఉరుసులో ఏఆర్‌ రెహమాన్ ప్రత్యేక ప్రార్థనలు!

Kadapa: కడప పెద్ద దర్గా (అమీన్ పీర్ దర్గా) ఉరుసు ఉత్సవాల్లో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ పాల్గొన్నారు. గంధం కార్యక్రమంలో పాల్గొని దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

G. RAVI KUMAR, KADAPA
Published on: 26 Oct 2026 7:44 AM IST
Kadapa
X

Kadapa: కడప అమీన్ పీర్ దర్గా ఉరుసులో ఏఆర్‌ రెహమాన్ ప్రత్యేక ప్రార్థనలు!

Kadapa: కడప అమీన్ పీర్ దర్గా ఉరుసు ఉత్సవాల్లో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ పాల్గొన్నారు.ఉరుసు ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన గంధం కార్యక్రమంలో ఏఆర్ రెహమాన్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.దర్గా పీఠాధిపతి స్వగృహం నుంచి గంధకలశాన్ని మేళతాళాలు, ఫకీర్ల బృందాలు, దర్గా పీఠాధిపతులు, ప్రముఖులు, శిష్యకోటి సమక్షంలో ఊరేగింపుగా పెద్ద దర్గా వద్దకు తీసుకొచ్చారు.

అనంతరం హజ్రత్ ఖ్వాజా సయ్యద్ షా ఆరిఫుల్లా మహమ్మద్ ఉల్ హుస్సేనీ చిష్టీ ఉల్ ఖాదరీ మజార్ వద్ద గంధాన్ని సమర్పించి ఫాతిహాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఏఆర్ రెహమాన్ దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఆయనను చూసేందుకు భక్తులు ఆసక్తి చూపించారు.

గంధం కార్యక్రమానికి కడప నగరానికి చెందిన రాజకీయ నాయకులు, ముస్లిం పెద్దలు, దర్గా శిష్యులు, భక్తులు భారీగా తరలివచ్చారు.భక్తుల రాకతో పెద్ద దర్గా పరిసరాలు జనసంద్రంగా మారాయి. ఏఆర్ రెహమాన్ పాల్గొనడంతో ఉరుసు గంధం కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

G. RAVI KUMAR, KADAPA

G. RAVI KUMAR, KADAPA