Proddatur: ఐడీ కార్డులున్న వారికే స్థానిక ఎన్నికల్లో టికెట్లు: రాచమల్లు
Proddatur: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఐడీ కార్డులున్న నిబద్ధత గల కార్యకర్తలకే పోటీ చేసే అవకాశం కల్పిస్తామని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు స్పష్టం చేశారు.
Proddatur: ఐడీ కార్డులున్న వారికే స్థానిక ఎన్నికల్లో టికెట్లు: రాచమల్లు
Proddatur: వైఎస్సార్సీపీ కార్యకర్తలకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యత కల్పిస్తామని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులకు ఐడీ కార్డులను పంపిణీ చేశారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, ఐడీ కార్డులు కలిగిన పార్టీ నిబద్ధత గల కార్యకర్తలకే పోటీ చేసే అవకాశం కల్పిస్తామని రాచమల్లు ప్రకటించారు. స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేస్తానని, అవసరమైతే తన సొంత ఆస్తులు అమ్మి అయినా పార్టీ విజయం కోసం కృషి చేస్తానని ధీమా వ్యక్తం చేశారు.
కేసులకు, బెదిరింపులకు భయపడేది లేదు..కూటమి ప్రభుత్వం ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, బెదిరింపులకు దిగినా భయపడే ప్రసక్తి లేదని, మరింత ఉత్సాహంతో పార్టీ కోసం పోరాడుతానని తెలిపారు.
చివరి శ్వాస వరకు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేలా పోరాటం చేస్తామని, తన చివరి శ్వాస ఉన్నంత వరకు వైఎస్సార్సీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. టీడీపీ ఒంటరిగా వైఎస్సార్సీపీని ఎదుర్కోగలదా అని చంద్రబాబును ప్రశ్నించారు. విడిపోతే ఓడిపోతామనే భయంతోనే కూటమి నాయకులు అయిష్టంగా కలిసి ఉన్నారని విమర్శించారు.
నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్త సమష్టిగా పనిచేసి మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేయాలని ఆయన పిలుపునిచ్చారు.




