Proddatur: ప్రొద్దుటూరులో వైభవంగా నూతన ఆర్టీసీ బస్టాండ్ ప్రారంభం!
Proddatur: ప్రొద్దుటూరులో నూతన ఆర్టీసీ బస్టాండ్‌ను ప్రారంభించిన రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి.
Proddatur: ప్రొద్దుటూరులో వైభవంగా నూతన ఆర్టీసీ బస్టాండ్ ప్రారంభం!
Proddatur: ప్రొద్దుటూరు ప్రజలకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కొత్త ఆర్టీసీ బస్టాండ్ అందుబాటులోకి వచ్చింది. ఈ నూతన బస్టాండ్‌ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డిలతో కలిసి శుక్రవారం వైభవంగా ప్రారంభించారు.మంత్రి మాట్లాడుతు రాష్ట్రంలో ప్రవేశపెట్టిన 'స్త్రీ శక్తి' పథకం ద్వారా ఇప్పటివరకు మహిళలు 100 కోట్ల ఉచిత ప్రయాణాలు పూర్తి చేసుకున్నారని మంత్రి తెలిపారు. రాష్ట్ర రవాణా వ్యవస్థను పర్యావరణ రహితంగా తీర్చిదిద్దేందుకు 750 ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ఇకపై కొనుగోలు చేసే ప్రతి బస్సు ఎలక్ట్రిక్ మరియు ఏసీ (AC) బస్సే ఉంటుందని స్పష్టం చేశారు.
గ్రామ స్థాయికి వెళ్లే పల్లె వెలుగు బస్సులతో పాటు, స్త్రీ శక్తి బస్సులను కూడా ఏసీ బస్సులుగా మార్చాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రొద్దుటూరులోని పాత బస్టాండ్‌ను మాస్టర్ ప్లాన్ ఆధారంగా సమగ్రంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రూ. 42 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. ప్రొద్దుటూరులో క్రీడల అభివృద్ధికి 5 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి వెల్లడించగా, అక్కడ ఒక అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ స్టేడియం నిర్మిస్తామని మంత్రి ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన అభివృద్ధిని వేగవంతం చేస్తూ, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని అయన తెలిపారు.




