rayachoti: మంత్రి మండిపల్లిని కలిసిన రాయచోటి మున్సిపల్ వైస్ చైర్మన్

rayachoti: రాయచోటి మున్సిపాలిటీ నూతన వైస్ చైర్మన్ పసుపులేటి చందన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 24 Nov 2026 9:49 AM IST
rayachoti
X

rayachoti: మంత్రి మండిపల్లిని కలిసిన రాయచోటి మున్సిపల్ వైస్ చైర్మన్

రాయచోటి: రాయచోటి మున్సిపాలిటీ నూతన వైస్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన పసుపులేటి చందన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి పూలదండతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా తనపై నమ్మకం ఉంచి మున్సిపల్ వైస్ చైర్మన్ బాధ్యతలు అప్పగించినందుకు మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, రాయచోటి మున్సిపాలిటీ అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భర్త రంజిత్, మడితాటి శ్రీనివాసులు రెడ్డి గారు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI