Rayachoti: ఏపీలో మారిన పింఛన్ల పంపిణీ విధానం - తాజా ఉత్తర్వులు జారీ!

Rayachoti: ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ల పంపిణీ విధానంలో కీలక మార్పులు చేసిన ఏపీ ప్రభుత్వం. కేంద్ర వాటా బ్యాంకు ఖాతాలో, రాష్ట్ర వాటా నేరుగా ఇంటి వద్దే అందజేత.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 23 Sept 2026 12:00 PM IST
Rayachoti
X

Rayachoti: ఏపీలో మారిన పింఛన్ల పంపిణీ విధానం - తాజా ఉత్తర్వులు జారీ!

Rayachoti: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా వికలాంగులు, వృద్ధులు మరియు వితంతువుల పింఛన్ల పంపిణీ విధానంలో మార్పులు చేస్తూ తాజా ఉత్తర్వులు (Memo No.3336974) జారీ చేసింది.

ముఖ్యమైన మార్పులు

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. పింఛన్ మొత్తాన్ని రెండు భాగాలుగా విభజించి పంపిణీ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ వాటా (NSAP Share): లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా జమ అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వ వాటా (NTR భరోసా): మిగిలిన అమౌంట్ ఎప్పటిలాగే మీ ఇంటి వద్దకే వచ్చి నగదు రూపంలో అందిస్తారు.

లబ్ధిదారులకు అందే పూర్తి వివరాలు వృద్ధాప్య పింఛన్ (60-79 సం||లు) బ్యాంకులో: ₹200 + చేతికి: ₹3800 = మొత్తం: ₹4,000

వృద్ధాప్య పింఛన్ (80 సం||లు పైబడిన వారు) బ్యాంకులో: ₹500 + చేతికి: ₹3500 = మొత్తం: ₹4,000

వితంతు పింఛన్ (40-79 సం||లు) బ్యాంకులో: ₹300 + చేతికి: ₹3700 = మొత్తం: ₹4,000

వితంతు పింఛన్ (80 సం||లు పైబడిన వారు) బ్యాంకులో: ₹500 + చేతికి: ₹3500 = మొత్తం: ₹4,000

వికలాంగుల పింఛన్ (18-79 సం||లు) బ్యాంకులో: ₹300 + చేతికి: ₹5700 = మొత్తం: ₹6,000

వికలాంగుల పింఛన్ (80 సం||లు పైబడిన వారు):

బ్యాంకులో: ₹500 + చేతికి: ₹5500 = మొత్తం: ₹6,000

గమనిక: పింఛన్ మొత్తం రూపాయి కూడా తగ్గదు, మీకు వచ్చే పూర్తి పింఛన్ (₹4000 లేదా ₹6000) యథావిధిగా అందుతుంది. కానీ కొంత భాగం బ్యాంకులో, మరికొంత భాగం చేతికి వస్తుంది.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI