Mydukuru: ఆదిరెడ్డిపల్లిలో పేద దంపతులకు రూ.10 వేల సాయం!

Mydukuru: మైదుకూరు మండలం ఆదిరెడ్డిపల్లికి చెందిన నిరుపేద శివయ్య దంపతులకు TSR సుభద్రమ్మ ట్రస్ట్ అధినేత సుభద్రమ్మ రూ.10,000 ఆర్థిక సాయం అందజేశారు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 20 Oct 2026 12:39 PM IST
Mydukuru
X

Mydukuru: ఆదిరెడ్డిపల్లిలో పేద దంపతులకు రూ.10 వేల సాయం!

Mydukuru: మైదుకూరు మండలం ఆదిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన శివయ్య దంపతులు ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కష్టాలను తెలుసుకున్న 'TSR సుభద్రమ్మ చారిటబుల్ ట్రస్ట్' అధినేత శ్రీమతి తమ్మిశెట్టి సుభద్రమ్మ గారు మానవతా దృక్పథంతో స్పందించారు. వారి బాధలను స్వయంగా తెలుసుకున్న ఆమె, తక్షణ ఆర్థిక సాయంగా రూ. 10,000 నగదును అందజేశారు.

​ఈ సందర్భంగా సుభద్రమ్మ గారు మాట్లాడుతూ.. "కష్టాల్లో ఉన్న నిరుపేదలను ఆదుకోవడమే మా ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం. శివయ్య కుటుంబానికి భవిష్యత్తులో కూడా ఎలాంటి అవసరం లేదా ఆపద వచ్చినా 'నేను ఉన్నాను' అంటూ అండగా ఉంటాం" అని భరోసా ఇచ్చారు. ఆపద సమయంలో పెద్ద మనసుతో అండగా నిలిచిన సుభద్రమ్మ గారికి శివయ్య దంపతులు, స్థానిక గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR