Mydukuru: మైదుకూరులో స్ట్రాంగ్ రూమ్‌లను తనిఖీ చేసిన కలెక్టర్!

Mydukuru: మైదుకూరు మున్సిపల్ ఆఫీస్‌లో స్ట్రాంగ్ రూమ్‌లు, లెక్కింపు కేంద్రాలను కలెక్టర్, ఎస్పీ తనిఖీ చేశారు. లెక్కింపు పారదర్శకంగా జరపాలని ఆదేశించారు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 28 Oct 2026 5:36 PM IST
Mydukuru
X

Mydukuru: మైదుకూరులో స్ట్రాంగ్ రూమ్‌లను తనిఖీ చేసిన కలెక్టర్!

Mydukuru: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి స్ట్రాంగ్ రూములు, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు.

బుధవారం జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్‌తో కలిసి మైదుకూరు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములు, ఓట్ల లెక్కింపు కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. అక్కడ చేపట్టిన భద్రతా ఏర్పాట్లు, కేంద్రాల్లో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలను సమీక్షించి, స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారి, సంబంధిత అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ఓట్ల లెక్కింపును ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తి పారదర్శకతతో నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. స్ట్రాంగ్ రూముల వద్ద నిరంతర భద్రతా పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని అధికారులను ఆదేశించారు.

ఎన్నికల నిర్వహణలో విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ, ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంతంగా, సజావుగా పూర్తి చేసేలా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో బద్వేలు ఆర్డీవో చంద్రమోహన్, మైదుకూరు మున్సిపల్ కమిషనర్ రంగస్వామి, ఆదిశేషారెడ్డి సంబందిత ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR