Mydukur: మైదుకూరు బాలుర ఉన్నత పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం!

Mydukur: మైదుకూరు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం ముందస్తు బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 13 Nov 2026 6:30 PM IST
Mydukur
X

Mydukur: మైదుకూరు బాలుర ఉన్నత పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం!

మైదుకూరు: మైదుకూరు జిల్లా పరిషత్ బాలురు ఉన్నత పాఠశాలలో దేశ మొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నవంబర్ 14 శనివారం సెలవు దినం కావడంతో 13వ తేదీ ముందస్తు బాలల దినోత్సవ వేడుకలను నిర్వహించారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోశెట్టి రామమోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ ప్రతినిధి రంజిత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.మందుగా నెహ్రు గారి చిత్రపటానికి పూల మాల వేసి నివాళలర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ బాల దినోత్సవం యొక్క ప్రాశస్త్యాన్ని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో పాటు తల్లిదండ్రుల పట్ల గురువుల పట్ల విధేయత గా ఉండాలని సూచించారు.

ప్రతి విద్యార్థి ఒక లక్ష్యంతో చదువుతూ జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. నేటి బాలలే రేపటి పౌరులు అన్న నెహ్రూ గారి మాటలకు అనుగుణంగా నేడు దేశం అన్ని రంగాలలో విద్యార్థు లను ప్రోత్సహించడానికి నేటి ప్రభుత్వాలు సాంకేతికతతో కూడిన విద్యను అందిస్తుందని అన్నారు. విద్యార్థులు సాంకేతికత మాటన చెడు అలవాట్లకు బానిస కాకుండా వారి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా పాఠశాలలో జరిగిన వివిధ పరీక్షలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో బహుమతులను అందించారు. క్రీడలలో ప్రతిభజ కనబరిచిన విద్యార్థులకు వ్యాయామ ఉపాధ్యాయులు బహుమతులను అందించారు.

కార్యక్రమంలో పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు A రాముడు , కె .పద్మజ,స్టాఫ్ సెక్రటరీ ఆవుల శ్రీనివాస్, కె ఆనంద రావు,రామ్ నాయక్ ,పద్మనాభయ్య,ప్రభాకర్,వెంకటేశు, సురేంద్ర ,ధనలక్ష్మి,మాధవీలత, స్వర్ణలత, లక్ష్మీ,భారతి,సునీత,ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR