Mydukur: తైక్వాండో రాష్ట్ర స్థాయి పోటీలకు షిరిడిసాయి విద్యార్థుల ఎంపిక
Mydukur: కడపలో జరిగిన 70వ ఎస్‌జీఎఫ్‌ఐ జిల్లా స్థాయి తైక్వాండో పోటీల్లో మైదుకూరు శ్రీ షిరిడిసాయి పాఠశాల విద్యార్థులు బంగారు, రజత పతకాలు సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు.
Mydukur: తైక్వాండో రాష్ట్ర స్థాయి పోటీలకు షిరిడిసాయి విద్యార్థుల ఎంపిక
మైదుకూరు: కడప నగరంలోని మునిసిపల్ ఇండోర్ స్టేడియంలో సోమవారం నిర్వహించిన 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SGFI) జిల్లా స్థాయి తైక్వాండో పోటీలలో శ్రీ షిరిడిసాయి పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
ఈ ఎంపిక పోటీలలో అండర్-14 బాలికల విభాగంలో కే. సంజీవ లహరి ప్రథమ స్థానం సాధించి స్వర్ణ పతకం కైవసం చేసుకోగా, అండర్-14 బాలుర విభాగంలో వి. నవీన్ కుమార్ ద్వితీయ స్థానంలో నిలిచి రజత పతకం సాధించారు.
ఈ సందర్భంగా తైక్వాండో మాస్టర్ మారుగాని సుధీర్ కుమార్ మాట్లాడుతూ, ప్రతిభ చూపిన ఈ ఇద్దరు విద్యార్థులు అక్టోబరు మాసంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలలో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. జిల్లా స్థాయిలో పతకాలు సాధించి పాఠశాలకు పేరు తెచ్చిన విద్యార్థులను శ్రీ షిరిడిసాయి స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రత్యేకంగా అభినందించి హర్షం వ్యక్తం చేశారు.




