Mydukur: పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలి: ఏవీ రమణ!

Mydukur: రాయలసీమ హక్కుల దినోత్సవం సందర్భంగా మైదుకూరులో జరిగిన కార్యక్రమంలో కడప జిల్లాలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని రైతు సేవా సమితి అధ్యక్షుడు ఏవీ రమణ కోరారు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 16 Nov 2026 1:56 PM IST
Mydukur
X

Mydukur: పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలి: ఏవీ రమణ!

మైదుకూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ ప్రాంత అభివృద్ధి కోసం 1937 నవంబర్ 16వ తేదీన శ్రీ బాగ్ ఒడంబడిక పేరుతో కోస్తా, ఆంధ్ర , రాయలసీమజిల్లాల నాయకుల మధ్య ఏర్పడిన హక్కుల చారిత్రక ఒప్పందమును అమలు చేయడంలో రాయలసీమ అన్యాయం జరుగుతా ఉందని ఈ 90 సంవత్సరాల కాలంలో మూడు రాష్ట్రాలు తమిళనాడు, తెలంగాణతో కూడిన ఆంధ్రప్రదేశ్, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రాయలసీమ జిల్లాలు కలిసి వున్న రైతులకు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం నిధులు కేటాయించి పూర్తి చేయలేదని రైతుసేవాసమితి కడప జిల్లా అధ్యక్షుడు ఏవి.రమణ అన్నారు.

ఈరోజు రాయలసీమ హక్కుల దినోత్సవ సందర్భంగా రైతు సేవాసమితి ఆధ్వర్యంలో మైదుకూరు పట్టణం కడప రోడ్డులోని అంబేద్కర్ సర్కిల్లో జరిగిన కార్యక్రమంలో ఏవి.రమణ మాట్లాడుతూ రాష్ట్రాలను అధిక శాతం పాలించిన వారు రాయలసీమ జిల్లా నాయకులైన రాయలసీమ జిల్లాలలో పారుతున్న నీటిని నిధులు కేటాయించి సాగునీటిప్రాజెక్టుల నిర్మాణం ద్వారా రాయలసీమ రైతులకు కడప జిల్లా రైతుకు నీరు అందించాల్సిన పాలకులు గతమంతా హైదరాబాదు రాజధానికి నిధులు కేటాయించి హైదరాబాదును అభివృద్ధి చేయడం జరిగిందని,

ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడిన రాయలసీమ జిల్లాలకు నిధులు కేటాయించకుండా నూతన రాజధాని అమరావతి, సాగునీటి ప్రాజెక్టు పోలవరానికి అధిక నిధులు కేటాయించి రాయలసీమ రైతుకూ అన్యాయం చేస్తున్నారని కడప జిల్లాలో కుందు, పెన్నా నదుల ద్వారా నీరు పారుతున్న కడప జిల్లా రైతుల ఆయకట్టుకు రాజోలి, జొలద రాశి, ప్రాజెక్టుల నిర్మాణం కోసం నిధులు కేటాయించ కుండ కేవలం శంకుస్థాపనలు చేసి నిధులు కేటాయించ కుండ కడప జిల్లా రైతుకు అన్యాయం చేస్తున్నారని ఈ సంవత్సరం కెసి.కెనాల్ రైతుకు శ్రీశైలం ప్రాజెక్టులో నీటి హక్కు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం త్రాగునీటి పేరుతో రైతుల పంటకునీరు ఇవ్వకుండా విద్యుత్ పేరుతో నీటిని అంత కూడా నాగార్జునసాగర్ కు పంపిణీ చేసి రాష్ట్ర ప్రభుత్వం కేసీ.కెనాల్ రైతుకు అన్యాయం చేసిందని రమణ అన్నారు.

ఇప్పటికైనా రాయలసీమ జిల్లాల రాజకీయ నాయకు లందరూ రాయలసీమ జిల్లాల అభివృద్ధి కోసం ఒకటైఉద్యమించాలని రమణ కోరారు. ఈరోజు జరిగిన ఈ కార్యక్రమంలో రైతు సేవాసమితి మైదుకూరు నియోజకవర్గ కార్యదర్శి మాడిశెట్టి సహదేవుడు, సమితి మండల, పట్టణ నాయకులు మూలే. రామచంద్రారెడ్డి, ఏపీ సుబ్బరాయుడు, బీసీ. సంఘంనాయకులుమాలకొండయ్య, గుజ్జుల లక్ష్మయ్యరైతులు దాశ రెడ్డి గారు సుబ్బరాయుడు, డిఆర్.సుబ్బరాయుడు, తిరుపాలయ్య తదితరులు పాల్గొన్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR