Mydukur: సంఘమిత్ర సిరాజుద్దీన్‌కు ఘన సన్మానం: మైదుకూరు

Mydukur: మైదుకూరు ద్వారకా నగర్ ఖాన్ కా-యే ఆస్థానంలో ఇండియన్ రెడ్ క్రాస్ పర్మినెంట్ మెంబర్ సంఘమిత్ర సిరాజుద్దీన్‌ను గురువు హజరత్ అబ్దుల్ హక్ ఘనంగా సన్మానించారు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 11 Oct 2026 9:05 PM IST
Mydukur
X

Mydukur: సంఘమిత్ర సిరాజుద్దీన్‌కు ఘన సన్మానం: మైదుకూరు

మైదుకూరు: అనాధలు వికలాంగులు మరియు నిరాశ్రయులను ఆదరిస్తూ తన వంతుగా వారికి దశాబ్దాలుగా సేవలు అందిస్తూ అనాధలు వికలాంగుల ఆశాజ్యోతిగా పేరుపొందిన షేక్ సంఘమిత్ర సిరాజుద్దీన్ ను మైదుకూరు ద్వారకా నగర్ లోని ఖాన్ కా- యే -హజరత్ సమీపిర్ మొహమ్మద్ షా అబ్దుల్ హక్ బాదుషా ఖాద్రీ అల్ చిష్ఠి ఆస్థానంలో ప్రముఖ గురువు హజరత్ మహమ్మద్ షా అబ్దుల్ హక్ శాలువా కప్పి పూలమాలవేసి సన్మానించారు.

ఆధ్యాత్మిక చింతన తో పాటు నిరాశ్రయులకు వృద్ధులకు పేదవారికి వికలాంగులకు తన వంతుగా సేవ చేయాలనే దృఢ సంకల్పంతో సేవ చేస్తున్న సంఘమిత్ర సిరాజుద్దీన్ ను సన్మానించడం తన బాధ్యతగా భావిస్తున్నానని అన్నారు.

నిస్వార్థంగా సేవ చేసేవారికి గుర్తింపు దక్కినప్పుడు, వారు మరింత బాధ్యతతో పనిచేయడానికి ఇది ప్రేరణనిస్తుందనీ గురువు హజరత్ మొహమ్మద్ షా అబ్దుల్ హక్ అన్నారు.

ఒకరిని సన్మానించడం ద్వారా సమాజంలో సేవ పట్ల ఇతరులకు కూడా ఆసక్తి కలుగుతుందనీ, ఆర్థిక ప్రయోజనాల కంటే వారి సేవకు ఇచ్చే గౌరవం వారికి ఎంతో మానసికబలాన్ని ఇస్తుందనీ ఆయన అన్నారు. ప్రచారం కోసం కాకుండా, నిజంగా వెనుకబడిన వర్గాల వారికి అనాధలకు నిరాశ్రయులకు వికలాంగులకు సంఘమిత్ర సిరాజుద్దీన్ దశాబ్దాలుగా సేవ చేస్తున్నారని ఆయన కొనియాడారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR