Mydukur: మైదుకూరు మున్సిపల్ చైర్మన్ ధనపాల జగన్మోహన్‌కు ఘన సన్మానం
Mydukur: మైదుకూరు మున్సిపల్ చైర్మన్ ధనపాల జగన్మోహన్‌ను 22వ వార్డు కౌన్సిలర్ గోవిందిన్నె కల్పన సన్మానించారు. వార్డు అభివృద్ధి పనులపై ప్రత్యేక చర్చ.
Mydukur: మైదుకూరు మున్సిపల్ చైర్మన్ ధనపాల జగన్మోహన్‌కు ఘన సన్మానం
మైదుకూరు: మైదుకూరు మున్సిపల్ చైర్మన్ ధనపాల జగన్మోహన్‌ను 22వ వార్డు కౌన్సిలర్ గోవిందిన్నె కల్పన శుక్రవారం ఘనంగా సన్మానించారు. 22వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన సీనియర్ జర్నలిస్ట్ గోవిందిన్నె శ్రీనివాసులు (వాసు) సతీమణి కల్పన, స్థానిక చైర్మన్ నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా చైర్మన్‌కు శాలువా కప్పి, పూలమాల వేసి అభినందనలు తెలపడంతో పాటు జ్ఞాపికను (మెమొంటో) అందజేశారు. వార్డు పరిధిలోని సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనులపై కూడా ఈ సందర్భంగా చర్చించినట్లు సమాచారం.
ఈ కార్యక్రమంలో యూనిట్ ఇంచార్జ్ బండి అమర్నాథ్, రేషన్ డీలర్ రాధిక, గోవిందిన్నె శ్రీనివాసులు (వాసు), కరిడి మధుసూదన్ రావు, సర్వేయర్ బుజ్జి తదితరులు పాల్గొన్నారు.




