Mydukur: మైదుకూరు బాధితులకు ఎమ్మెల్యే పుట్టా భరోసా!
Mydukur: మైదుకూరు నియోజకవర్గంలో 57 మందికి ₹52.56 లక్షల సీఎం సహాయ నిధి: ప్రొద్దుటూరు క్యాంపు కార్యాలయంలో చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్.
Mydukur: మైదుకూరు బాధితులకు ఎమ్మెల్యే పుట్టా భరోసా!
మైదుకూరు: మైదుకూరు నియోజకవర్గానికి చెందిన 57 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన మొత్తం ₹52,56,883/- ఆర్థిక సహాయాన్ని మైదుకూరు ఎమ్మెల్యే శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారు ప్రొద్దుటూరులోని క్యాంపు కార్యాలయంలో అందజేశారు.
వైద్య చికిత్సల కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన సహాయాన్ని ఎమ్మెల్యే గారు లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.




