Mydukur: జిల్లెల్ల గ్రామ పంచాయతీ ఏకగ్రీవం.. సర్పంచ్‌గా కళావతి
Mydukur: దువ్వూరు మండలం జిల్లెల్ల గ్రామ పంచాయతీ ఏకగ్రీవం; సర్పంచ్‌గా గంగుల కళావతి, ఉప సర్పంచ్‌గా శ్రీనివాసులు, 10 వార్డు సభ్యులు ఎన్నిక.
Mydukur: జిల్లెల్ల గ్రామ పంచాయతీ ఏకగ్రీవం.. సర్పంచ్‌గా కళావతి
మైదుకూరు: దువ్వూరు మండలం జిల్లెల్ల గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, ఏకగ్రీవంగా ముగిశాయి. గ్రామ సర్పంచ్‌గా గంగుల కళావతి , ఉప సర్పంచ్‌గా శ్రీనివాసులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితో పాటు పంచాయతీ పరిధిలోని మొత్తం 10 మంది వార్డు సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి (RO) నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు 10 మంది వార్డు సభ్యులకు అధికారిక ఎన్నిక ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఏకగ్రీవానికి కృషి చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా పనిచేసి పంచాయతీని ఏకగ్రీవం చేసుకోవడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.




