Mydukur: దువ్వూరులో ఘనంగా కామ్రేడ్ శ్రీహరి 92వ జయంతి వేడుకలు!
Mydukur: మైదుకూరు మండలం దువ్వూరు సబ్‌స్టేషన్ వద్ద యుఈఈయూ వ్యవస్థాపకులు కామ్రేడ్ శ్రీహరి 92వ జయంతి వేడుకలు. శిలాఫలకం ఆవిష్కరణ.
Mydukur: దువ్వూరులో ఘనంగా కామ్రేడ్ శ్రీహరి 92వ జయంతి వేడుకలు!
Mydukur: యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) వ్యవస్థాపకులు కామ్రేడ్ శ్రీహరి 92వ జయంతి వేడుకలు స్థానిక విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని, యూనియన్ పతాకాన్ని డిస్కం అధ్యక్షుడు ఎన్. శివశంకర్, జిల్లా గౌరవాధ్యక్షులు కామనూరు శ్రీనివాసుల రెడ్డి ఆవిష్కరించారు.
కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ, 1989లో కామ్రేడ్ శ్రీహరి కార్మికులు, ఉద్యోగుల సంక్షేమం మరియు హక్కుల సాధన కోసం సీఐటీయూ అనుబంధంగా యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్‌ను స్థాపించారని గుర్తుచేశారు. ఆయన చూపిన బాటలోనే పయనిస్తూ విద్యుత్ సంస్థల పరిరక్షణతో పాటు, వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించేందుకు యూనియన్ నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
అనంతరం జిల్లా అధ్యక్షుడు నాగసుబ్బయ్య మాట్లాడుతూ, విద్యుత్ ఉద్యోగులకు తక్షణమే వేతన సవరణ కమిటీని ఏర్పాటు చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేసి వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
డివిజన్ అధ్యక్షుడు రామ్మోహన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కె.వి. సురేంద్రబాబు, నాగమల్లయ్య, డివిజన్ నాయకులు రమణ, వరదారెడ్డి, శివరాం, జయసింహ, నరేష్, శివతేజ, శ్రీనివాసుల రెడ్డి, తాహిర్ బాషాతో పాటు దువ్వూరు సెక్షన్ కార్మికులు, నాయకులు పాల్గొన్నారు.




