Punganur: పుంగనూరు అంజుమన్ కమిటీ సెక్రటరీ తీరుపై ముస్లింల ఆగ్రహం!

Punganur: పుంగనూరు అంజుమన్ కమిటీ సెక్రటరీ ఇబ్రహీం టీడీపీ నాయకులతో కలిసి కింది కూర్చుని భోజనం చేయడంపై ముస్లిం సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

MAHESH, PUNGANOOR
Updated on: 5 Oct 2026 12:29 PM IST
Punganur
X

Punganur: పుంగనూరు అంజుమన్ కమిటీ సెక్రటరీ తీరుపై ముస్లింల ఆగ్రహం!

Punganur: పుంగనూరు అంజుమన్ కమిటీ సెక్రటరీగా ఉన్న ఇబ్రహీం ముస్లిం సమాజం తలదించుకునే విధంగా వ్యవహరించారు.

టిడిపి నాయకులంతా డైనింగ్ టేబుల్ పై కూర్చుని భోజనం చేస్తుంటే ఈయన కింద కూర్చొని భోజనం చేయడం ముస్లిం సమాజానికి సిగ్గుచేటు అని విమర్శలు వస్తున్నాయి. ముస్లిం ఆచారాలను సంప్రదాయాలను కాపాడాల్సిన ఒక గౌరవప్రదమైన పదవిలో ఉండి ఇలా చేయడం ఏంటి అని విమర్శలు వస్తున్నాయి.

ఈ విషయంపై ఇబ్రహీం పుంగనూరు పట్టణ ముస్లింలకు ఏ విధంగా సమాధానం చెబుతాడాని ప్రశ్నిస్తున్నారు. అంజుమన్ కమిటీ సెక్రటరీ అంటే పుంగనూరులో ఉన్న మసీదుల కమిటీలకు దిశా నిర్దేశం చేసే పెద్ద అలాంటి వ్యక్తి ఇలా రాజకీయ లబ్ధి కోసం ముస్లింల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని ముస్లింలు ఆవేదన వ్యక్తం చెందుతున్నాను.

ఆ ఫోటో కాస్త సోషల్ మీడియా లలో వైరల్ గా మారుతోంది. ఈయన ఇలా వ్యవహరించడం ముస్లిం సమాజానికి సిగ్గుచేటని ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

MAHESH, PUNGANOOR

MAHESH, PUNGANOOR