Rayachoti: రాయచోటిలో మతసామరస్యాలకు ప్రతీకగా గణేష్ ఉత్సవం

Rayachoti: రాయచోటిలో గణేష్ నిమజ్జన శోభాయాత్రలో పాల్గొన్న భక్తులకు ముస్లిం సోదరులు మజ్జిగ, కూల్ డ్రింక్స్ పంపిణీ చేసి మత సామరస్యాన్ని చాటుకున్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 24 Sept 2026 11:09 PM IST
Rayachoti
X

Rayachoti: రాయచోటిలో మతసామరస్యాలకు ప్రతీకగా గణేష్ ఉత్సవం

అన్నమయ్య జిల్లా: రాయచోటి పట్టణంలోని ముస్లిం సోదరులు మానవత్వం చాటుకున్నారు. హిందువులు గత పది రోజులు పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయక చవితి వేడుకలను జరుపుకొని 11వ రోజు సందర్భంగా వినాయకుని నిమజ్జనానికి తరలి వెళుతున్న భక్తుల దాహార్తిని తీర్చేందుకు తమ వంతుగా బిస్మిల్లా డ్రైవింగ్ స్కూల్ అధినేత బిస్మిల్లా బ్రదర్ ఆధ్వర్యంలో వాటర్ బాటిల్లు, మజ్జిగ, కూల్ డ్రింక్స్ వంటివి హిందూ సోదరులకు అందజేశారు.

కుల మతాలకు అతీతంగా సేవ చేస్తూ సోదర భావంతో మతసామరస్యాన్ని చాటుకున్నారు. తామంతా ఒకటేనని హిందువులు ముస్లింలు వేర్వేరు కాదని మానవులంతా ఒకటేనని అందరూ కూడా సోదర భావంతో ఐక్యతతో కలసి మెలసి ఉండాలని సందేశాన్ని ఇచ్చారు. ముస్లిం సోదరుల సేవను చూసిన పలువురు అభినందిస్తున్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI