Duvvur: దువ్వూరు మండలంలో ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్డును తనిఖీ చేసిన ఎంపీడీవో!
Duvvur: దువ్వూరు మండలం సంజీవరెడ్డిపల్లి ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్డును ఎంపీడీవో జవహర్ బాబు ఆకస్మికంగా తనిఖీ చేసి, వర్మీ కంపోస్ట్ తయారీపై పలు సూచనలు చేశారు.
Duvvur: దువ్వూరు మండలంలో ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్డును తనిఖీ చేసిన ఎంపీడీవో!
Duvvur: గ్రామాల్లో తడి, పొడి చెత్తను ఇళ్ల వద్దనే వేరు చేసి సేకరించడం ద్వారా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు పంచాయతీల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో జవహర్ బాబు పిలుపునిచ్చారు. మండల పరిధిలోని సంజీవరెడ్డిపల్లి సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ (ఎస్‌డబ్ల్యూపీసీ) షెడ్డును ఆయన మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడి పారిశుద్ధ్య నిర్వహణ, తడి చెత్తతో వర్మీ కంపోస్ట్ తయారు చేసే విధానాన్ని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. ప్రజలు ఇళ్ల వద్దే బిన్ బ్యాగ్ విధానంలో పొడి చెత్తను వేరు చేసి స్వచ్ఛ రథం వాహనాలకు అందించేలా చైతన్యపరచాలని తెలిపారు. ఇందుకోసం ప్రవేశపెట్టిన ‘దసరా డబుల్ ధమాకా ఆఫర్’పై విస్తృతంగా ప్రచారం చేసి, నిబంధనలు పాటించే కుటుంబాలకు బహుమతులు అందేలా చూడాలన్నారు. అదేవిధంగా తడి చెత్తను హరిత రాయబారులకు అందించేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
సేకరించిన తడి చెత్తతో ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్లలో శాస్త్రీయ పద్ధతిలో నాణ్యమైన వర్మీ కంపోస్ట్ తయారు చేయాలని, ఈ నెలాఖరు నాటికి ప్రతి షెడ్డు నుంచి కనీసం ఒక టన్ను ఎరువును ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకోవాలని ఆదేశించారు. ఈ ప్రక్రియను పంచాయతీ అభివృద్ధి అధికారులు (పీడీవో) నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఉత్పత్తి అయిన వర్మీ కంపోస్ట్‌ను విక్రయించడం ద్వారా పంచాయతీలకు నిధులు సమకూరుతాయని స్పష్టం చేశారు. గ్రామ పారిశుద్ధ్యంపై ప్రభుత్వం నిర్వహించే ఐవీఆర్‌ఎస్ (IVRS) కాల్స్‌లో ప్రజల నుంచి సానుకూల ఫీడ్‌బ్యాక్ వచ్చేలా క్షేత్రస్థాయి సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ అభివృద్ధి అధికారి సత్యవాణి, హరిత రాయబారులు, స్వచ్ఛ రథం ఆపరేటర్లు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.




