Duvvur: అత్త సర్పంచ్.. కోడలు జడ్పీటీసీ! గుడిపాడులో అరుదైన ఘనత!
Duvvur: దువ్వూరు మండలం గుడిపాడు సర్పంచ్‌గా బోరెడ్డి రాజేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇదే కుటుంబంలో కోడలు ఇందురెడ్డి జడ్పీటీసీగా గెలుపొందడంతో అత్తాకోడళ్లు కీలక పదవుల్లో నిలిచారు.
Duvvur: అత్త సర్పంచ్.. కోడలు జడ్పీటీసీ! గుడిపాడులో అరుదైన ఘనత!
Duvvur: దువ్వూరు మండలంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు కీలక ప్రజాప్రతినిధులుగా ఎన్నికై అరుదైన ఘనత సాధించారు. దువ్వూరు మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ బోరెడ్డి వెంకటరమణారెడ్డి కుటుంబంలో అత్త సర్పంచ్‌గా, కోడలు జడ్పీటీసీ సభ్యురాలిగా పదవులు చేపట్టడంతో ఆ కుటుంబంతో పాటు పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో వెంకటరమణారెడ్డి కోడలు బోరెడ్డి ఇందురెడ్డి దువ్వూరు మండల జడ్పీటీసీ సభ్యురాలిగా విజయం సాధించారు. తాజాగా శుక్రవారం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆయన సతీమణి బోరెడ్డి రాజేశ్వరి దువ్వూరు మండలంలోని గుడిపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అంతేకాకుండా, ఈ పంచాయతీ పరిధిలోని మొత్తం 14 వార్డుల సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికవడం విశేషం.
ఒకే కుటుంబంలో అత్తాకోడళ్లు ఇద్దరూ ఉన్నత పదవులకు ఎన్నికవడంపై గ్రామస్థులు, స్థానిక నేతలు హర్షం వ్యక్తం చేస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మండల టీడీపీ కన్వీనర్ బోరెడ్డి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. గుడిపాడు పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవం కావడానికి సహకరించిన గ్రామ ప్రజలకు, టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.




