Rayachoti: రాయచోటి జనసేన నాయకులతో సమావేశమైన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్!

Rayachoti: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జనసైనికులు సమష్టిగా పనిచేయాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పిలుపునిచ్చారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 30 Sept 2026 4:08 PM IST
Rayachoti
X

Rayachoti: రాయచోటి జనసేన నాయకులతో సమావేశమైన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్!

Rayachoti: రాయచోటి నియోజకవర్గం జన సైనికులతో రాజోలు ఎమ్మెల్యే దేవర ప్రసాద్. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జనసైనికులు సమష్టిగా పనిచేయాలని రాజోలి ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పిలుపునిచ్చారు. జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అతికారి కృష్ణ, కడప జనసేన నాయకుడు సుంకర శ్రీనివాస్ లతో కలిసి రాయచోటి నియోజకవర్గానికి చెందిన జనసేన నాయకులతో ఆయన సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా దేవ వరప్రసాద్ మాట్లాడుతూ.. కూటమి పార్టీల మధ్య పొత్తు ధర్మాన్ని తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు ప్రకటించిన అనంతరం జనసేన ఎన్ని స్థానాల్లో, ఎక్కడెక్కడ పోటీ చేస్తుందనే విషయాన్ని వెల్లడిస్తామని తెలిపారు. జనసేన నాయకులకు కేటాయించే స్థానాలపై త్వరలోనే స్పష్టత వస్తుందన్నారు.సామాన్య కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దడమే జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

జనసేన పోటీ చేసే స్థానాల్లో విజయం సాధించేలా ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఈ నియోజకవర్గం ముఖ్య నాయకులు పప్పిరెడ్డి మహేశ్వర్ రెడ్డి, బుడ్డా నాగభూషణ, ప్రదీప్ రాయల్, సతీష్ రాయల్,పఠాన్, నిమ్మనపల్లె పవన్ కుమార్, చిన్నారి, రాఘవ, బుల్లెట్ విజయ్, జనసేన మైనార్టీ నాయకులు వీర మహిళలు అభిమానులు తదితరులు హాజరయ్యారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI