Jammalamadugu: జమ్మలమడుగులో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డి భారీ రోడ్ షో!
Jammalamadugu: జమ్మలమడుగు మున్సిపల్ ఎన్నికల్లో కూటమి విజయాన్ని ఎవరూ ఆపలేరన్న ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. కన్నెలూరు వరకు భారీ రోడ్ షో.
Jammalamadugu: జమ్మలమడుగులో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డి భారీ రోడ్ షో!
Jammalamadugu: కడప జిల్లా జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం కన్నెలూరు వరకు నాయకులు, కార్యకర్తలతో రోడ్ షో నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంతో పాటు ప్రజల నమ్మకాన్ని గెలుచుకుందని కొనియాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తవుగానే ప్రతి వార్డుకు కోటి రూపాయల నిధులు విడుదల అవుతాయన్నారు.
జిల్లాలో అన్నిచోట్ల ఏకగ్రీవం కాగా కడప, జమ్మలమడుగు, పులివెందుల మున్సిపాలిటీలలో ఎన్నికలు జరుగునున్నాయని తెలిపారు. జమ్మలమడుగుతో పాటు పులివెందులను ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలిచేందుకు కృషి చేస్తామన్నారు.
జమ్మలమడుగు లో నాలుగు వార్డులు ఏకగ్రీవం అయ్యాయని, మిగతా 28 వార్డులకు, చైర్ పర్సన్ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయని చెప్పారు. జమ్మలమడుగు పట్టణ ప్రజలు అభివృద్ధి, సంక్షేమం దృష్టిలో ఉంచుకొని టిడిపి మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి చదిపిరాళ్ల జ్యోతిని, కూటమి అభ్యర్థులను వార్డు కౌన్సిలర్లుగా మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు.




