Jammalamadugu: రాహుల్ గాంధీ, వైఎస్ జగన్‌పై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఫైర్!
Jammalamadugu: రాహుల్ గాంధీ, వైఎస్ జగన్‌లపై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దొంగ ఓట్ల రాజకీయంపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Jammalamadugu: రాహుల్ గాంధీ, వైఎస్ జగన్‌పై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఫైర్!
Jammalamadugu: ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు రాహుల్ గాంధీకి తిక్క ఏమైనా ఉందా ఎక్కడో ఢిల్లీ నుంచే అంతా నడుస్తోందని అవాకులు చవాకులు పేలుతున్నారు. రాహుల్ గాంధీకి తిక్క ఏమైనా ఉందా అని అడుగుతున్నా! పదవుల కోసం, మీ రాజకీయ స్వలాభం కోసం ఓటర్ల వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఇష్టమొచ్చినట్లు దొంగ మాటలు, పచ్చి అబద్ధాలు చెప్తారా?" అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
స్వయంగా ప్రకాష్ రాజ్ డబుల్ గేమ్ ఆడాడు గతంలో ఓటర్ల వ్యవస్థ ఎంత అస్తవ్యస్తంగా ఉండేదో వివరిస్తూ, "సినీ నటుడు ప్రకాష్ రాజ్‌కు గతంలో ఒకేసారి 4 వేర్వేరు చోట్ల ఓటు హక్కు ఉండేది. ఒకే మనిషికి 4 చోట్ల ఓట్లు ఉంటే, 'సర్' వ్యవస్థ వచ్చి వాటిని తొలగిస్తే అతనికి కోపం వచ్చింది. డబుల్, త్రిపుల్ ఎంట్రీలతో మోసం 0చేయాలనుకునే ఇటువంటి వాళ్ల డోప్, దొంగ ఆటలు ఈ రోజు డిజిటల్ సిస్టమ్‌లో నడవవు!" అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
"జగన్ రెడ్డి ఐదేళ్ల విధ్వంసం.. అంతా దొంగ ఓట్ల రాజకీయం": "మిస్టర్ జగన్.. ఐదేళ్లు జమ్మలమడుగును, రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసి పెట్టావ్. గొల్లప్రోలు, గొల్లకోటల్లో 5,900 దొంగ ఓట్లు, బోడితిప్పలపాడు, మేడిదిన్నెల్లో 11,000 దొంగ ఓట్లు వేసుకొని దొంగ స్టాంపింగ్ రాజకీయాలు చేశారు. అలాంటి దొంగ ఓట్లు, చనిపోయిన వారి పేర్లు, డబుల్ ఎంట్రీలను ఈ రోజు 'సర్' వ్యవస్థ ఏరిపారేస్తుంటే మీకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి" అని ఎద్దేవా చేశారు.
"ఎవరి దయాదాక్షిణ్యాలు అక్కర్లేదు.. యువత ధైర్యంగా దరఖాస్తు చేసుకోండి": "18 ఏళ్లు నిండిన Gen-Z యువతకు ఓటు హక్కు కల్పించేందుకు ఫారం-6 ద్వారా పూర్తి పారదర్శకంగా, డిజిటల్ పద్ధతిలో వికేంద్రీకరణ చేశాం. దొంగ ఓట్ల కల్చర్ పోయి 'రియల్ వ్యవస్థ' వచ్చింది, విమర్శకుల 'రీల్ వ్యవస్థ' పడిపోయింది" అని స్పష్టం చేశారు.




