Kadapa: అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? అవినాష్‌కు సవాల్!

Kadapa: జమ్మలమడుగులో అభివృద్ధిపై చర్చకు రావాలని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సవాల్; కూటమి సమావేశంలో వైఎస్సార్‌సీపీపై విమర్శలు.

D. CHINNI KRISHNA, JAMMALAMADUGU
Published on: 4 Oct 2026 7:17 AM IST
Kadapa
X

Kadapa: అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? అవినాష్‌కు సవాల్!

Kadapa: అభివృద్ధి విషయంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చర్చకు రావాలని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సవాల్ విసిరారు. జమ్మలమడుగు అయినా, పులివెందుల అయినా సరే తాను ఓపెన్ డిబేట్‌కు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.

కడప జిల్లా జమ్మలమడుగు రిపబ్లిక్ క్లబ్‌లో కూటమి నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వైఎస్సార్‌సీపీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

ముందస్తు బెయిల్‌ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ.. గుండెపోటు పేరుతో నాటకం ఆడారని ఆరోపించారు. కుటుంబ సభ్యులను పక్కన పెట్టారంటూ వైఎస్ జగన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

వైఎస్ జగన్‌పై ఉన్న సీబీఐ, ఈడీ కేసులను ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడిపై గతంలో కేసులు, ఆరోపణలతో ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు.

డీఎస్సీ విషయంలో నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించిన ఆదినారాయణ రెడ్డి.. గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ప్రజలు 11 సీట్లు మాత్రమే ఇచ్చారని, రాబోయే ఎన్నికల్లోనూ ప్రజలు తగిన సమాధానం చెబుతారని వ్యాఖ్యానించారు.

ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పేర్కొన్నారు.సోమవారం 5 వ తేదీన సీఎం చంద్రబాబు ప్రొద్దుటూరు పర్యటనను విజయవంతం చేయాలని, నాయకులు,కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

D. CHINNI KRISHNA, JAMMALAMADUGU

D. CHINNI KRISHNA, JAMMALAMADUGU