Rayachoty: బీసీల రాజకీయ ప్రాతినిధ్యం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది!

Rayachoty: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి స్పష్టం చేశారు

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 4 Oct 2026 1:00 PM IST
Rayachoty
X

Rayachoty: బీసీల రాజకీయ ప్రాతినిధ్యం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది!

Rayachoty: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. బీసీలకు రాజకీయంగా సముచిత ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు సామాజిక న్యాయాన్ని సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందన్నారు.

బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో అసెంబ్లీలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని జీవో నంబర్ 105, 1065 జారీ చేసిందని తెలిపారు. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు.

ఎన్నికలు జరగకపోయినా, బీసీలకు రిజర్వేషన్ దక్కకూడదనే కుట్రతో గోడ్డలి పార్టీ నేతలు అడ్డుకుంటున్నారని మంత్రి విమర్శించారు. బీసీలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని స్పష్టం చేశారు.

న్యాయపరంగా ఉన్న ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని బీసీలకు న్యాయం జరిగేలా చూస్తామని, వైసీపీ హయాంలో 34 శాతం రిజర్వేషన్ల కోసం కొట్టేసిన సుప్రీంకోర్టు తీర్పులకు వ్యతిరేకంగా వెళ్లకుండా బీసీలకు చారిత్రాత్మక ద్రోహం చేశారని మంత్రి పేర్కొన్నారు.

స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న తమ సంకల్పం మారదని, బీసీలకు న్యాయం జరిగే వరకు కృషి చేస్తామని తెలిపారు. 34 శాతం రిజర్వేషన్లతోనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని మంత్రి అన్నారు.

బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ఇస్తే రాజకీయ ప్రాతినిధ్యం పెరుగుతుందని, కులంతో సంబంధం లేకుండా అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.

బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెరగాలి

బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా వారి సమస్యలను మరింత సమర్థవంతంగా పరిష్కరించే అవకాశం ఉంటుందని మంత్రి అన్నారు. సమాజంలో వెనుకబడి ఉన్న బీసీల అభ్యున్నతి కోసం తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు.

పైకోర్టు తీర్పును గౌరవిస్తూ బీసీలకు న్యాయం జరిగేలా సుప్రీంకోర్టులో న్యాయపరమైన పోరాటం కొనసాగిస్తామని మంత్రి తెలిపారు. ఇది కేవలం రిజర్వేషన్ల అంశం మాత్రమే కాదని, బీసీలకు దక్కాల్సిన రాజకీయ ప్రాతినిధ్యానికి సంబంధించిన అంశమని స్పష్టం చేశారు.

నాలుగు దశాబ్దాలుగా బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే దిశగా వివిధ ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయని మంత్రి గుర్తు చేశారు. 1987లో బీసీలకు 20 శాతం, 1995లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. బీసీలకు రాజకీయ సాధికారత కల్పించడమే లక్ష్యంగా ఈ విధానం కొనసాగుతోందన్నారు.

బీసీలకు న్యాయం జరగాలి.. వారికి దక్కాల్సిన రాజకీయ ప్రాతినిధ్యం దక్కాలి. 34 శాతం రిజర్వేషన్ల అమలు కోసం ప్రభుత్వం రాజ్యాంగబద్ధమైన, న్యాయపరమైన మార్గాల్లో ముందుకు సాగుతుంది అని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI