Rayachoti: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మంత్రి ప్రజా దర్బార్!

Rayachoti: చిన్నమండెం మండలం పడమటి కోన బోరెడ్డిగారిపల్లెలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 29 Nov 2026 11:34 AM IST
Rayachoti
X

Rayachoti: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మంత్రి ప్రజా దర్బార్!

Rayachoti: చిన్నమండెం మండలం పడమటి కోన గ్రామంలోని బోరెడ్డిగారిపల్లెలో మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ప్రజా దర్బార్ నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను మంత్రి గారి దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలు తెలిపిన సమస్యలను సావధానంగా విన్న మంత్రి గారు, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే ప్రజా దర్బార్ ప్రధాన ఉద్దేశమని మంత్రి గారు తెలిపారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI