Proddutur: ప్రొద్దుటూరులో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి తేనీటి విందు

Proddutur: కడప జిల్లా ప్రొద్దుటూరులో రాష్ట్ర షేక్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ వి.ఎస్. ముక్తియార్ ఏర్పాటు చేసిన తేనీటి విందులో రవాణా శాఖ మంత్రి పాల్గొన్నారు.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 9 Oct 2026 12:49 PM IST
Proddutur
X

Proddutur: ప్రొద్దుటూరులో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి తేనీటి విందు

Proddutur: ప్రొద్దుటూరులో రాష్ట్ర షేక్ వెల్ఫేర్ కార్పొరేషన్ చెర్మెన్ డా వి ఎస్ ముక్తియార్ ఏర్పాటు చేసిన తేనీటి విందులో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర షేక్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ వి.ఎస్. ముక్తియార్ ఆహ్వానం మేరకు ప్రొద్దుటూరులో ఏర్పాటు చేసిన తేనీటి విందులో ఆంధ్రప్రదేశ్ రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.

​ఈ సందర్భంగా ముక్తియార్‌తో పాటు పార్టీ నాయకులతో మంత్రి ఆత్మీయంగా ముచ్చటించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రికి స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

​ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు నంద్యాల రాఘవరెడ్డి, నంద్యాల కొండారెడ్డిలతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR