Proddatur: ప్రొద్దుటూరులో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ఘన స్వాగతం!
Proddatur: ప్రొద్దుటూరు పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి.
Proddatur: ప్రొద్దుటూరులో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ఘన స్వాగతం!
Proddatur: ప్రొద్దుటూరు పర్యటనలో భాగంగా ప్రొద్దుటూరులోని R&B గెస్ట్ హౌస్కు చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి వర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కి పొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మరియు కడప ఆర్టీసీ రీజినల్ మేనేజర్ (RM), R&B శాఖ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రివర్యులకు పుష్పగుచ్ఛాలు అందజేసి సాదరంగా ఆహ్వానించారు. మంత్రి పర్యటన సందర్భంగా అధికారులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు.
ఈ కర్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్, మాజీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.




