Rayachoti: ఘనంగా మండిపల్లి నిశ్చల్ నాగిరెడ్డి జన్మదిన వేడుకలు!
Rayachoti: రాయచోటి నియోజకవర్గంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కుమారుడు నిశ్చల్ నాగిరెడ్డి జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ శ్రేణులు.
Rayachoti: ఘనంగా మండిపల్లి నిశ్చల్ నాగిరెడ్డి జన్మదిన వేడుకలు!
రాయచోటి: అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం చిన్నమండెం మండలం పడమటికొన గ్రామం బోరెడ్డిగారిపల్లిలోని స్వగృహంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి కుమారుడు మండిపల్లి నిశ్చల్ నాగిరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మండిపల్లి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి కేక్ కట్ చేసి మండిపల్లి నిశ్చల్ నాగిరెడ్డికి ఆత్మీయంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిశ్చల్ నాగిరెడ్డి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు.




