Rayachoti: బీసీ గర్జన పేరుతో వైసీపీ డ్రామాలు.. మంత్రి మండిపల్లి ఆగ్రహం!

Rayachoti: రాయచోటిలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర బీసీ గర్జన పేరుతో వైసీపీ డ్రామాలు ఆడుతోందని మండిపడ్డారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 8 Oct 2026 4:01 PM IST
Rayachoti
X

Rayachoti: బీసీ గర్జన పేరుతో వైసీపీ డ్రామాలు.. మంత్రి మండిపల్లి ఆగ్రహం!

Rayachoti: ఉత్తరాంధ్ర బీసీ గర్జన పేరుతో YSRCP బహిరంగ సభ ఏర్పాట్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.

ఎన్నికలు వచ్చినప్పుడే వైసీపీకి బీసీలు గుర్తొస్తారు. అధికారంలో ఉన్నప్పుడు బీసీలను పట్టించుకోని పార్టీ ఇప్పుడు బీసీ గర్జన పేరుతో డ్రామాలు చేస్తోంది. బీసీల పేరుతో సభలు పెట్టే నైతిక హక్కు వైసీపీకి లేదు. ఐదేళ్ల పాలనలో బీసీలను అణచివేసి, వేధింపులకు గురిచేసిన చరిత్ర వైసీపీది. బీసీ నాయకుడి తోట చంద్రయ్య ఆత్మఘోష వైసీపీ నేతలకు వినిపించడం లేదా. చంద్రయ్యను దారుణ హత్యను చేసి మర్చిపోయి ఇప్పుడు బీసీలపై ప్రేమ ఒలకబోస్తారా..

బీసీలకు అన్యాయం చేసింది ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలుసు బీసీలపై దాడులు, అక్రమ కేసులు, వేధింపులతో వైసీపీ పాలన సాగింది. ఎల్లప్పుడూ బీసీలకు తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తోంది. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు, లోకేష్ నాయకత్వం వరకు బీసీల అభ్యున్నతికి టీడీపీ కట్టుబడి ఉంది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పోరాడుతోంది. వైసీపీ మాత్రం రిజర్వేషన్ల పేరుతో రాజకీయ పబ్బం గడుపుతోంది.

చంద్రబాబు గారు బీసీలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారు. బీసీలకు న్యాయం జరిగే వరకు కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గదు. బీసీ గర్జన పేరుతో వైసీపీ ఎన్ని సభలు పెట్టినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. బీసీ అంటే తెలుగుదేశం.. తెలుగుదేశం అంటే బీసీ. ఈ వాస్తవాన్ని వైసీపీ ఎంత మభ్యపెట్టినా మార్చలేరు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI