Rayachoty: రాయచోటి నూతన బస్టాండ్ నిర్మాణంపై మంత్రి మండిపల్లి సమీక్ష!
Rayachoty: రాయచోటిలో నూతన ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణ పనులపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అధికారులతో సమీక్ష. మెరుగైన వసతులు కల్పించాలని ఆదేశం.
Rayachoty: రాయచోటి నూతన బస్టాండ్ నిర్మాణంపై మంత్రి మండిపల్లి సమీక్ష!
Rayachoty: చిన్నమండెం మండలం పడమటి కోన గ్రామం బోరెడ్డిగారి పల్లెలోని తన సొంత నివాసంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని కడప ఆర్టీసీ ఈడీ కిషోర్ కుమార్ గారు, ఆర్‌ఎం శశిభూషణ్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా రాయచోటిలో నూతనంగా నిర్మించబోయే ఆర్టీసీ బస్టాండు నిర్మాణానికి సంబంధించిన అంశాలతో పాటు, అన్నమయ్య, కడప జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ పరిస్థితులు, బస్సుల నిర్వహణ, ప్రయాణికులకు అందుతున్న రవాణా సౌకర్యాలు, వివిధ ప్రాంతాలకు బస్సు సర్వీసులు తదితర అంశాలను మంత్రి గారు అధికారులను అడిగి తెలుసుకున్నారు.
జిల్లా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. రాయచోటి నూతన బస్టాండు నిర్మాణ పనులను వేగవంతం చేయడంతో పాటు, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ సేవలను మరింత మెరుగుపరచాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు.
ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఆర్టీసీ సేవలను మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.




