Rayachoti: గొర్లముదివేడులో బాలుడికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి నివాళి

Rayachoti: రాయచోటి మండలం గొర్లముదివేడులో అనారోగ్యంతో మృతి చెందిన బాలుడి భౌతికకాయానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నివాళులర్పించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 20 Oct 2026 8:29 PM IST
Rayachoti
X

Rayachoti: గొర్లముదివేడులో బాలుడికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి నివాళి

అన్నమయ్య జిల్లా: రాయచోటి మండలం గొర్లముదివేడు గ్రామానికి చెందిన వీరారెడ్డి కుమారుడు అనారోగ్యంతో మృతి చెందడంతో, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు బాలుడి భౌతికకాయానికి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా బాలుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. చిన్న వయసులోనే బాలుడు మృతి చెందడం అత్యంత బాధాకరమని, ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.

బాలుడి మృతి పట్ల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఈ విషాద సమయంలో బాలుడి కుటుంబ సభ్యులకు అండగా ఉంటూ, వారి దుఃఖంలో పాలుపంచుకున్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI