Annamayya: ప్రజలు భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తామన్న మంత్రి!
Annamayya: అన్నమయ్య గాలివీడు మండలం గోరాంచెరువు నుంచి అసర్ల గంగమ్మ ఆలయం వరకు సీసీ రోడ్డు పనులను పరిశీలించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. నాణ్యత ముఖ్యం.
Annamayya: ప్రజలు భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తామన్న మంత్రి!
Annamayya: గాలివీడు మండలం గోరాంచెరువు గ్రామ పరిధిలోని కుమ్మరపల్లి నుంచి గాలివీడు గ్రామంలోని బలిజపల్లి సమీపంలో ఉన్న అసర్ల గంగమ్మ ఆలయం వరకు నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పరిశీలించారు.
రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని, నిబంధనల ప్రకారం పటిష్టంగా పనులు చేపట్టాలని కాంట్రాక్టర్‌కు స్పష్టంగా సూచించారు. ప్రజలకు, ఆలయానికి వచ్చే భక్తులకు దీర్ఘకాలికంగా ఉపయోగపడేలా నాణ్యమైన రహదారి నిర్మాణం పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
ప్రజల అవసరాలు, భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని గాలివీడు మండలంలో అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు




